ఓట్ల వేటలో దూకుడు పెంచిన కూటమి అభ్యర్థి వెంకటేష్ చౌదరి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: తవణంపల్లె

తవణంపల్లి మండల జెడ్పీటీసీ కూటమి అభ్యర్థి జె వెంకటేష్ చౌదరి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మండలంలో సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరవేయడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఆయన ధైర్యంగా తెలిపారు.