నర్సంపేటలో కురిసిన వర్షంతో రైతన్నల మోముల్లో ఆనందం
రిపోర్టర్: ఇజం జర్నలిసిం ✍️✍️
స్థలం: నర్సంపేట
నర్సంపేట పట్టణంలో వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు వాన ఊరటనిచ్చింది. అయితే, వినాయక నిమజ్జనం నేపథ్యంలో వర్షం నిర్వాహకులకు కొంత ఇబ్బందిగా మారింది. ఏర్పాట్లలో నిమగ్నమైన నిర్వాహకులు వర్షంలోనూ పనులు కొనసాగిస్తున్నారు. మండపాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేసేందుకు తడుస్తూనే శ్రమిస్తున్నారు.