పాలకొల్లు అభివృద్ధికి పుష్కర నిధులు రూ 145 కోట్లు మంజూరు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: పశ్చిమ గోదావరి
పాలకొల్లు పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం పుష్కర నిధులు కింద రూ 145 కోట్లు మంజూరు చేసినట్లు జలవనరుల శాఖ మంత్రి మరియు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పాలకొల్లు మున్సిపల్ కార్యాలయ సమావేశ హాల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని వివిధ శాఖల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కోట్లాది రూపాయలతో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని అధికారులను మరియు ఏజెన్సీ ప్రతినిధులను ఆయన ఆదేశించారు.