లండన్ విమానాశ్రయంలో టీడీపీ ఇంచార్జ్ కూరపాటి శంకర్ రెడ్డికి ఘన స్వాగతం
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
వ్యక్తిగత కార్యక్రమం నిమిత్తం లండన్‌కు విచ్చేసిన సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డికి లండన్ హీత్రో విమానాశ్రయంలో స్థానిక టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రవాసాంధ్రులతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.