ఇంట కిందపడిన మాజీ మంత్రి విడుదల రజిని: పోలీసులతో వాగ్వాదం

రిపోర్టర్: కిరణ్ స్థలం: Andhra Pradesh

నివాసం వద్ద పోలీసులు తనను అడ్డుకోవడంతో మాజీ మంత్రి విడుదల రజిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటకు వెళ్లకుండా అడ్డుకున్న మహిళా ఎస్సై తోసివేయడంతో కిందపడిపోయినట్లు ఆమె ఆవేదన వెలిబుచ్చారు. తనను గృహనిర్బంధం చేయడంపై మండిపడ్డారు. బీఫామ్ ఇవ్వడానికి వచ్చిన నాయకులను కలవనీయకపోవడంపై ఎస్సైని నిలదీసినట్లు విడుదల రజిని మీడియాకు తెలిపారు.