ఐదేళ్లలో భారీగా పెరిగిన నోయిడా ఫ్లాట్ మార్కెట్ విలువ

రిపోర్టర్: హరి స్థలం: నోయిడా

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఐదేళ్ల క్రితం పెట్టుబడి కోసం కొనుగోలు చేసిన ఒక వన్ బీహెచ్కే ఫ్లాట్కు రూ. 42 లక్షల భారీ ఆఫర్ వచ్చినట్లు ఇంటి యజమాని వివేక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తాను 2021లో కేవలం రూ. 26 లక్షలకే ఈ ఆస్తులను కొనుగోలు చేశానని తెలిపారు. అయితే మెట్రో స్టేషన్కు సమీపంలో ఉండటంతో నిరంతరం అద్దె రూపంలో మంచి ఆదాయం వచ్చిందని పేర్కొంటూ, ప్రస్తుతం తనకు ఆ డబ్బు అవసరం లేకపోవడంతో పాటు ఆ ఫ్లాట్ పట్ల భావోద్వేగ అనుబంధం ఏర్పడిందని వివేక్ స్పష్టం చేశారు.