'నిజాలు నిగ్గు తేలుస్తాం..': దిశ సాలియన్ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు

రిపోర్టర్: నరేష్ స్థలం: మహారాష్ట్ర

ముంబైలో సంచలనం సృష్టించిన 2020 నాటి దిశ సాలియన్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ఆదిత్య ఠాక్రే, దిశ సాలియన్, రియా చక్రవర్తి, సూరజ్ పంచోలి తదితరుల పాత్రపై విచారణ జరపాలని సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును టేకప్ చేసిన అధికారులు, ఆధారాల ధ్వంసం మరియు కుట్ర కోణాలపై లోతుగా దర్యాప్తు చేపట్టనున్నారు.