హర్యానా బోర్డు సప్లిమెంటరీ పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల

రిపోర్టర్: సురేష్ స్థలం: హర్యానా

హర్యానా పాఠశాల విద్యా బోర్డు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. బోర్డు చైర్మన్ శంకర్ లాల్ ధూపడ్, కార్యదర్శి దీపక్ బాబూలాల్ కర్వా ఈ వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 1 నుండి 22 వరకు ఈ పరీక్షలు జరగనుండగా, అధికారిక వెబ్‌సైట్ నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.