తీవ్ర తుపాను ముప్పు: కాకినాడ జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లాకు అర్బద్ తుపాన్ ముప్పు పొంచి ఉందని, రేపు రాత్రికి ఇది తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బాపట్ల – విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. అత్యవసర సహాయం కోసం జిల్లా కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు.