రాజధాని అమరావతిలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
రాజధాని అమరావతిలో ప్రతినెలా రెండు వేల కోట్ల రూపాయల విలువైన పనులు జరిగేలా స్పష్టమైన ప్రణాళికతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. పనుల్లో ఎక్కడా అశ్రద్ధకు తావులేకుండా నాణ్యతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అమరావతి నగరాభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం పన్నెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.