క్రీడాకారులకు తీరని అన్యాయం: నెల్లూరులో ప్రారంభానికి నోచుకోని మొగళ్లపాలెం ఇండోర్ స్టేడియం

రిపోర్టర్: గోపి స్థలం: నెల్లూరు

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్రీడా అకాడమీలు పూర్తిగా మూతపడటంతో ప్రతిభావంతులైన యువ క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో నెల్లూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో బ్యాడ్మింటన్, ఫుట్బాల్, ఖోఖో, అథ్లెటిక్స్, హ్యాండ్బాల్, వాలీబాల్కు సంబంధించి ఆరు అకాడమీలు ఉండేవి. ఏటా రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులను శిక్షణకు ఎంపిక చేసి జాతీయ స్థాయి పోటీలకు తయారు చేసేవారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఐదేళ్లుగా ఈ అకాడమీలు మూతపడ్డాయని, నాటి నుంచి నేటి వరకు వాటి ఊసే లేదని క్రీడాకారులు వాపోతున్నారు.