నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్యపై సమగ్ర విచారణ జరపాలి
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
జూలూరుపాడులో నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్యపై సమగ్ర విచారణ జరపాలని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా కార్యదర్శి ఏపూరి లతాదేవి డిమాండ్ చేశారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. హత్యపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు బత్తినేని నీరజతో పాటు పలువురు మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు.