మంత్రి పదవి పోయినా సారీ చెప్పబోమన్న కొండా మురళి

రిపోర్టర్: సతీష్ స్థలం: వరంగల్

సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని సూచించినా మంత్రి పదవి పోయినా సరే సారీ చెప్పబోమని మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులు తేల్చిచెప్పారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని కొండా మురళి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని పేర్కొంటూ, దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని బసవరాజు సారయ్యకు సవాల్ విసిరారు.