రాష్ట్రంలో కీలక సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: రమేష్ స్థలం: Andhra Pradesh

ఏపీలో సాగునీటి రంగానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేశారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కరువు ప్రాంతాలకు కృష్ణా జలాలు, పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి నీటిని తరలించే కీలక ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. తెలుగు నేల సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ భారీ నీటి పారుదల ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా ఈ జలవనరుల ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి.