ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం, బీఎండబ్ల్యూ కారు బోల్తా పడి ముగ్గురు మృతి

రిపోర్టర్: అశోక్ స్థలం: ముంబై

ముంబైలోని కోస్టల్‌ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి వంతెన రక్షణ గోడను ఢీకొట్టి కింద పడిపోయింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మెరైన్‌ డ్రైవ్‌ నుంచి హాజీఅలీ వైపు వెళ్తుండగా లోటస్‌ జెట్టీ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో షనాయ్‌ గజ్జల్, ధిర్యా సేథ్‌ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.