అక్షర సాధనతో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఉపాధ్యాయుడి కృషి

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు పబ్బు దేవేందర్గౌడ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా సాధించారు. తెలంగాణలో గౌడ సామాజికవర్గ రాజకీయ అవగాహన, భాగస్వామ్యంపై ఆయన పరిశోధన పూర్తి చేసి ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా చౌటుప్పల్లో సహచర ఉపాధ్యాయులు, మిత్రులు ఆయనను ఘనంగా సన్మానించారు. కష్టపడి చదివితే మంచి గుర్తింపుతో పాటు సమాజంలో ఉన్నత స్థానం లభిస్తుందని దేవేందర్గౌడ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యతో సమాజాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.