అద్దె ఆలస్యమంటూ జరిమానా: యజమానికి చుక్కలు చూపించిన టెనెంట్

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

అద్దె చెల్లించడం ఒక్క రోజు ఆలస్యమైందని యజమాని జరిమానా విధించడంతో ఒక యువకుడు తెలివైన ప్రతీకారం తీర్చుకున్నాడని సోషల్ మీడియాలో పోస్టు వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని డెకిమ్ కల్వినో అనే ఎక్స్ యూజర్ వెల్లడించారు. జరిమానా కట్టిన ఆ యువకుడు, నెలల తరబడి పెండింగ్లో ఉన్న మరమ్మతుల జాబితాతో ఒక ఎక్సెల్ షీట్ తయారు చేసి యజమానికి పంపాడు. ఇతరుల సమస్యలను కూడా అందులో చేర్చి యజమానిని నిలదీయడంతో ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.