జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో వేగం: భారతీ సిమెంట్స్ పిటిషన్లపై వాదనలు షురూ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Hyderabad

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో సీబీఐ కోర్టు వేగం పెంచిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఆరు ఛార్జిషీట్లలోని నలభై ఐదు డిశ్ఛార్జి పిటిషన్లపై వాదనలు ముగిశాయని, తాజాగా భారతీ సిమెంట్స్ కేసులో విచారణ ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ కేసుల్లో మొత్తం నూట నలభై ఒక్క డిశ్ఛార్జి పిటిషన్లు దాఖలు కాగా, గత పద్నాలుగు సంవత్సరాలుగా ఇవి పెండింగ్లోనే ఉన్నట్లు స్పష్టం చేశారు.