ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా ప్రభుత్వం తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్‌గా త్రివిక్రమ్ వర్మ, సీఐడీ సైబర్ క్రైమ్స్ ఐజీగా జయలక్ష్మి, రైల్వే ఐజీగా బి.రాజకుమారి నియమితులయ్యారు. అలాగే కాంతి రాణాకు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు అప్పగించగా, మార్కాపురం, పోలవరం, పల్నాడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు.