యువత భవితకు భరోసా ఇస్తూ ఉద్యోగాల భర్తీ చేపట్టిన కూటమి సర్కార్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: శ్రీకాకుళం

సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువత భవితకు భరోసానిస్తూ ఉద్యోగాల భర్తీని వేగవంతం చేసింది. ఇప్పటికే వేలాదిగా టీచర్, పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయగా, తాజాగా వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేశారు. నిరుద్యోగులకు మేలు చేసేలా పారదర్శకంగా ఈ నియామకాలు చేపట్టడంపై హర్షం వ్యక్తమవుతోంది.