ఉమర్ ఖాలిద్ శర్జీల్ ఇమామ్ బెయిల్ పిటిషన్ల విచారణ సెప్టెంబర్ ముప్పైకి వాయిదా
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
దిల్లీ అల్లర్ల కుట్ర కేసులో నిందితులుగా ఉన్న ఆందోళనకారులు ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్ల బెయిల్ పిటిషన్లపై విచారణను దిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది. న్యాయవాదుల అనారోగ్య కారణాల రీత్యా ఈ వాయిదా వేసినట్లు కోర్టు తెలిపింది. 2020 ఫిబ్రవరిలో ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉందన్న ఆరోపణలపై వీరిపై ఉపా చట్టం కింద కేసులు నమోదయ్యాయి.