చిన్న వ్యాపారుల రుణాలు: తెలంగాణలో 26 శాతం, ఏపీలో 25 శాతం వృద్ధి
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
చిన్న వ్యాపారులు రుణాలు తీసుకుంటున్నప్పటికీ వాటిలో అధిక భాగం వ్యక్తిగత పేర్లతోనే ఉంటున్నాయని ట్రాన్స్యూనియన్ సిబిల్, ఎన్ఎస్ఐసీ సంయుక్త అధ్యయనం వెల్లడించింది. గత మూడేళ్ల కాలంలో ఈ రుణాలు తెలంగాణలో ఏటా సగటున 26 శాతం, ఆంధ్రప్రదేశ్లో 25 శాతం చొప్పున పెరిగాయి. అయితే సూక్ష్మ వ్యాపార సంస్థల పేరుతో తీసుకున్న రుణాల వృద్ధి తెలంగాణలో 13 శాతం, ఏపీలో 11 శాతానికే పరిమితమైందని నివేదిక స్పష్టం చేసింది.