ఏపీకి తుఫాన్ ముప్పు ఈనెల 22 మరియు 23 తేదీల్లో భారీ వర్షాలు
రిపోర్టర్: హరి
స్థలం: Andhra Pradesh
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీకి తుఫాన్ ముప్పు పొంచిఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 22, 23 తేదీల్లో ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం బలపడి తుఫాన్‌గా మారే సూచనలు ఉండటంతో విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది.