పిఠాపురంలో మైసమ్మ చెరువును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
రిపోర్టర్: హరి
స్థలం: కాకినాడ జిల్లా
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఫకృద్ధీన్ పాలెంలో రూ. 73 లక్షలతో అభివృద్ధి చేసిన మైసమ్మ చెరువును ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదమే లక్ష్యంగా వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్కు, ఓపెన్ ఎయిర్ జిమ్‌తో ఈ చెరువును మోడల్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో మరో 11 చెరువుల సుందరీకరణ శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.