ధన్‌బాద్‌లో దారుణం: మహిళ తల నరికి హత్య!
రిపోర్టర్: సునీల్
స్థలం: జార్ఖండ్
జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్‌లోని ఖేర్బాడి అటవీ ప్రాంతంలో ఓ మహిళ తల లేని మృతదేహం కలకలం రేపింది. మృతురాలిని పూనమ్ కుమారిగా గుర్తించారు. మృతదేహానికి వంద మీటర్ల దూరంలో ప్లాస్టిక్ సంచిలో తలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలంలో ఎర్రటి గుడ్డ ముక్కలు, అగర్బత్తీలు లభించాయి. ఈ దారుణ హత్యకు సంబంధించి మృతురాలి ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.