బాబాయ్ హత్యతో అబ్బాయికే లాభమంటూ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం
రిపోర్టర్: సునీల్
స్థలం: పశ్చిమ గోదావరి
బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో అబ్బాయి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే రాజకీయంగా పూర్తి లబ్ధి చేకూరిందని జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య వెనుక ఉన్న అసలు నిజాలు, కుట్ర కోణాలపై సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. బాబాయ్ హత్యను రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని మండిపడ్డారు.