జోధ్‌పూర్‌లో రెండో విడత తరంగ్ శక్తి విన్యాసాలకు సన్నాహాలు
రిపోర్టర్: గోపి
స్థలం: రాజస్థాన్
భారతీయ వాయుసేన ప్రతిష్టాత్మకంగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో రెండో విడత తరంగ్ శక్తి బహుళజాతి వాయు విన్యాసాలను నిర్వహించనుంది. సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 12 వరకు జరిగే ఈ విన్యాసాలలో పలు దేశాల వాయుసేనలు పాల్గొని సంయుక్త వ్యూహాత్మక విన్యాసాలు, శిక్షణలో పాలుపంచుకోనున్నాయి. విదేశీ బలగాలతో కలిసి సంయుక్త ఆపరేషన్లు నిర్వహించడం ద్వారా పరస్పర సహకారాన్ని మెరుగుపరచడమే ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యమని వాయుసేన వెల్లడించింది.