వన్ ప్లస్ 16 స్మార్ట్ ఫోన్ డిజైన్ వివరాలు వెల్లడించిన చైనా అధ్యక్షుడు

రిపోర్టర్: సునీల్ స్థలం: చైనా

ప్రముఖ టెక్ దిగ్గజం వన్‌ప్లస్ రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 16 డిజైన్ మరియు ఫీచర్ల వివరాలను వన్‌ప్లస్ చైనా అధ్యక్షుడు లి జై లూయిస్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. ఈ ఫోన్ సన్నని డిస్‌ప్లే బెజెల్స్, మెటల్ ఫ్రేమ్, మార్స్-ప్రేరేపిత కలర్ వేరియంట్లు మరియు అనుకూలీకరించదగిన షార్ట్‌కట్ కీతో రానున్నట్లు తెలిపారు. ఇందులో 165Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉండనుందని సమాచారం.