అమెరికాలో సంచలనం: తాను ఏది మాట్లాడినా మద్దతుదారులు చప్పట్లు కొడతారన్న డొనాల్డ్ ట్రంప్

రిపోర్టర్: అశోక్ స్థలం: Tennessee

తాను అత్యంత తెలివితక్కువ మాటలు మాట్లాడినా తన మద్దతుదారులు అభినందిస్తూ చప్పట్లు కొడతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారని అమెరికా మీడియా వెల్లడించింది. టెన్నెస్సీ రాష్ట్రంలోని క్లార్క్స్విల్లేలో జరిగిన రిపబ్లికన్ జాతీయ కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన ర్యాలీలలో లభించే అనూహ్య ఆదరణను వివరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.