'ఉద్యోగుల సంక్షేమమే మా లక్ష్యం': కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Amaravati

ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 10%, 75 ఏళ్లు దాటిన వారికి 15% అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ వర్తింపు, పోలీసు సిబ్బందికి మరో అడిషనల్ సరెండర్ లీవ్, 2022 సరెండర్ లీవ్స్ సంక్రాంతికి జమ, డీఏల చెల్లింపు మరియు 12వ PRC నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.