ముంబైలో బీభత్సం: ట్రాఫిక్ పోలీసుపై నుంచి లగ్జరీ కారు పోనిచ్చిన మహిళ
రిపోర్టర్: రాము
స్థలం: Mumbai
ముంబైలోని జుహూ ప్రాంతంలో కారుతో ట్రాఫిక్ పోలీసును తొక్కించడానికి ప్రయత్నించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఒక వాహనాన్ని ఢీకొట్టి పారిపోతున్న మహిళను ఆపేందుకు యత్నించిన కానిస్టేబుల్ పైకి కారు దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. స్థానికులు అడ్డుకోవడంతో కారు ఆపిన మహిళ అక్కడి నుంచి వెళ్తూ వీడియో రికార్డ్ చేసింది. నిందితురాలిని గుర్తించి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు.