పలాస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలాస నియోజకవర్గ సమన్వయకర్త కూటమి నాయకులతో విస్తృత సమావేశం

రిపోర్టర్: Dinesh panda స్థలం: పలాస

పలాస

నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త శ్రీ వెంకన్న చౌదరి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పలాస నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు తదితర అంశాలపై నాయకులు విస్తృతంగా చర్చించారు. కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన పాలన, సంక్షేమ ఫలాలు అందేలా మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.

నియోజకవర్గంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కారం చూపే దిశగా ప్రజలతో నిరంతరం మమేకమై పనిచేయాలని నాయకులకు సూచించారు.

అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయడం వంటి అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, పలాస నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని శ్రీ వెంకన్న చౌదరి గారు పిలుపునిచ్చారు

ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.