ఈ వారంలో ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు కేటాయింపు పత్రాలు

రిపోర్టర్: సునీల్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో ఇందిరమ్మ టవర్స్, LIG గృహాల లక్కీ డ్రాలో ఎంపికైన అర్హులైన లబ్ధిదారులకు ఈ వారంలోనే కేటాయింపు పత్రాలు జారీ చేయనున్నారు. ఇప్పటివరకు 5,521 మందిని అర్హులుగా నిర్ధారించారు. బ్రోకర్లను నమ్మి మోసపోవద్దని, డబ్బులు చెల్లించవద్దని హౌసింగ్ బోర్డు వైస్‌ ఛైర్మన్ వీపీ గౌతమ్ హెచ్చరించారు.