చెరువుల సుందరీకరణలో అందరి భాగస్వామ్యం అవసరం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

రిపోర్టర్: కృష్ణ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

పర్యావరణ పరిరక్షణలో అందరి భాగస్వామ్యం అత్యంత అవసరమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్పష్టం చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని జీడిమెట్ల డివిజన్ వెన్నెలగడ్డ చెరువు సుందరీకరణ పనులను బ్లూ ఓసియన్ ప్రాజెక్టులో భాగంగా అసెజ్ వావో సంస్థ ప్రతినిధులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విశేష కృషి చేస్తున్న ఆ సంస్థ ప్రతినిధుల సేవలను ఆయన అభినందించారు.