సెమిస్టర్‌కు ఒకసారే టాయిలెట్ రూల్: చైనా పాఠశాలలో వివాదం
రిపోర్టర్: హరి
స్థలం: World
చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న రుయువాన్ కౌంటీ హైస్కూల్ విద్యార్థులకు టాయిలెట్ వినియోగంపై పెట్టిన నిబంధన తీవ్ర దుమారం రేపుతోంది. సెమిస్టర్‌కు కేవలం ఒక్కసారే క్లాస్ రూమ్ నుంచి టాయిలెట్‌కు వెళ్లేందుకు అనుమతిస్తామని, రెండోసారి వెళ్తే తల్లిదండ్రులను పిలిపిస్తామని స్కూల్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇది కేవలం వదం మాత్రమేనని పాఠశాల అధికారులు కొట్టిపారేయగా, విద్యాశాఖ దీనిపై విచారణ జరుపుతోంది.