బెల్లంపల్లి పట్టణ బస్తీలో నూతన సైడ్ కాలువ మరియు రోడ్డు నిర్మాణ పనులకు అంకురార్పణ

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తీలో నూతన సైడ్ కాలువ, రోడ్డు నిర్మాణ పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. కౌన్సిలర్ సిమ్రాన్ ఖలీం ఆధ్వర్యంలో చేపట్టిన పనులను మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి–రమేష్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పట్టణ అభివృద్ధి నిధులతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, డీఈ సుమతి, కాంట్రాక్టర్ సాయి, నాయకులు ఖలీల్ ఈట రాకేష్, బస్తీ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.