హైదరాబాద్‌లో వేగంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ

రిపోర్టర్: సురేష్ స్థలం: Hyderabad

హైదరాబాద్‌ మహానగర పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక అర్హులు లభించకపోవడంతో మరోసారి లాటరీ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దరఖాస్తుదారులు ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు సవరించుకోవచ్చని, సోమవారం నుంచి అలాట్‌మెంట్ లెటర్లు పంపనున్నట్లు టీజీహెచ్‌బీ వెల్లడించింది.