క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్: వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్ వెలువడింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ అక్టోబర్ రెండున ప్రారంభమై నవంబర్ ఇరవై ఒకటిన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం పద్నాలుగు జట్లు కప్పు కోసం పోటీపడుతుండగా, పన్నెండు వేదికల్లో యాభై ఏడు మ్యాచ్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.