జయమ్ము నిశ్చయమ్మురా షోలో నారా లోకేశ్ సందడి: బాలయ్య డైలాగ్తో అదుర్స్

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

జీ5 వేదికగా ప్రసారమవుతున్న జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 మూడవ ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. నటుడు జగపతిబాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో ప్రోమో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. స్కూల్ రోజుల్లో తాను చేసిన అల్లరి పనులను, బాలకృష్ణ సినిమాలలోని పాపులర్ డైలాగ్లను చెబుతూ లోకేశ్ నవ్వులు పూయించారు. ఈ ఇంటర్వ్యూ నవంబర్ 6న జీ5లో ప్రీమియర్ కానుంది.