మహిళలకు తీపి కబురు: నేడే ఉచిత చీరల పంపిణీ ప్రారంభం
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఉచిత చీరల పంపిణీకి సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొంబై ఐదు లక్షల మంది అర్హులైన మహిళలకు నూతన డిజిటల్ విధానంలో పారదర్శకంగా చీరలను అందజేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.