కృష్ణా జలాల పంపకాలపై తేలని పంచాయితీ, భగ్గుమన్న ఇరు రాష్ట్రాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాలపై తీవ్ర వాదనలు చోటుచేసుకున్నాయి. 50:50 నిష్పత్తిలో నీటిని కేటాయించాలని తెలంగాణ కోరగా, ఏపీ 66:34 నిష్పత్తికే పట్టుబట్టింది. పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమ తరలింపుపై తెలంగాణ, జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఏపీ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఇరు రాష్ట్రాల రాజీలేని వైఖరితో సమావేశం ఏకాభిప్రాయం లేకుండానే ముగిసింది.