ఏపీలో ఈవీ వాహనాల కొనుగోలుపై భారీ సబ్సిడీ ప్రకటన

రిపోర్టర్: మహేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. ఈవీల కొనుగోలుపై 5% వరకు సబ్సిడీ, ఐదేళ్ల పాటు రోడ్ టాక్స్ మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలిపారు. తొలి 5,000 చార్జింగ్ స్టేషన్లకు 25% లేదా గరిష్టంగా రూ.3 లక్షల ప్రోత్సాహకం అందించనున్నట్లు వెల్లడించారు.