షాకింగ్ ఘటన: బతుకమ్మ ఆడుతూ కుప్పకూలిన సాఫ్ట్ వేర్ యువతి మృతి

రిపోర్టర్: నరేష్ స్థలం: Asifabad

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబరాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మ ఆడుతూ శ్రీవాణి అనే సాఫ్ట్ వేర్ యువతి ఆకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోవడంతో మృతి చెందిందని స్థానికులు తెలిపారు. చెన్నైలో ఉద్యోగం చేసే ఆమె పండుగ కోసం మేనత్త ఇంటికి వచ్చారని, బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిందని, వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.