'ప్రజా సేవకు 25 ఏళ్లు.. దేశవ్యాప్తంగా మోదీ జన్మదిన వేడుకలు': బీజేపీ ప్రకటన
రిపోర్టర్: అశోక్
స్థలం: భారతదేశం
దేశ ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు వేడుకలు మరియు ఆయన రాజకీయ జీవితంలో 25 ఏళ్ల నిర్విరామ ప్రజా సేవను పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా భారీ వేడుకలకు శ్రీకారం చుట్టింది. రాబోయే నెల రోజుల పాటు ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గుజరాత్లోని వాద్నగర్ నుంచి వారణాసి వరకు అమిత్ షా బైక్ ర్యాలీని ప్రారంభించనుండగా, ఢిల్లీలో నితిన్ నబిన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, స్వచ్ఛతా డ్రైవ్లు మరియు ఆశీర్వాద దీపం కార్యక్రమాలు చేపట్టనున్నారు.