ఏపీలో ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా విడుదల, రేపు ఘనంగా సత్కారం

రిపోర్టర్: అశోక్ స్థలం: ఆంధ్రప్రదేశ్

2026 సంవత్సరానికి గాను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ నుంచి 79 మంది, ఇంటర్ బోర్డు నుంచి 24 మందిని అవార్డులకు ఎంపిక చేశారు. కాకినాడ, విజయనగరం, కడప జిల్లాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. గురుపూజోత్సవం సందర్భంగా రేపు ప్రభుత్వం వీరిని ఘనంగా సత్కరించనుంది.