కదిరిలో విషాదం: తొమ్మిది నెలల గర్భిణి జ్యోతి అకస్మాత్తుగా మృతి
రిపోర్టర్: హరి
స్థలం: కదిరి
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వివాహం జరిగిన పదహారు ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన ఏఎన్ఎం జ్యోతి అర్ధరాత్రి అస్వస్థతకు గురై మృతి చెందారని వైద్యులు తెలిపారు. స్థానిక సచివాలయంలో ఉద్యోగం చేస్తున్న ఆమె గురువారం రాత్రి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడటంతో భర్త ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.