పోకలపాలెం కునుకూరు రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన చేసిన ఎంపీటీసీ

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: కొయ్యూరు

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ పరిధిలోని పోకలపాలెం కునుకూరు గ్రామాల మధ్య జరుగుతున్న నూతన తారురోడ్డు నిర్మాణ పనులను స్థానిక ఎంపీటీసీ నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన జేఈతో పాటు కాంట్రాక్టర్తో మాట్లాడి రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గకుండా పనులు చేపట్టాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి పనులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని ఆయన కోరారు.