టెలివిజన్ రంగంలో విషాదం: గుండెపోటుతో ప్రముఖ నటుడు అనుజ్ ఠాకూర్ మృతి

రిపోర్టర్: రాజేష్ స్థలం: Mumbai

టెలివిజన్ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు అనుజ్ ఠాకూర్ అకస్మాత్తుగా మరణించినట్లు ఆయన స్నేహితుడు, కాస్టింగ్ డైరెక్టర్ రూపేష్ సోనార్ వెల్లడించారు. అక్టోబర్ 27న ఆయన మృతి చెందారని తెలిపారు. నిద్రలోనే తీవ్ర మూర్ఛ రావడంతో అనుజ్ ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పలు ధారావాహికల్ లో నటించిన అనుజ్ అకస్మాత్తు మృతితో సహనటులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పిస్తున్నారు.