మంగళగిరి కొండపై అరుదైన పునుగుపిల్లి ప్రత్యక్షం
రిపోర్టర్: హరి
స్థలం: గుంటూరు
గుంటూరు జిల్లా మంగళగిరి పానకాల స్వామి కొండపై అరుదైన పునుగుపిల్లి ప్రత్యక్షమైంది. కొండ ఎక్కుతున్న భక్తులకు ఇది తారసపడింది. శేషాచలం, నల్లమల అడవుల్లో కనిపించే ఈ జాతి పిల్లి శరీరం నుంచి వచ్చే జవాది ద్రవం అత్యంత పవిత్రమైన సువాసనల తైలంగా మారుతుంది. తిరుమల శ్రీవారి అభిషేకానికి వాడే ఈ పునుగు తైలం విశిష్టతపై స్థానికుల్లో చర్చ జరుగుతోంది. దీనిపై అటవీ శాఖ అధికారులు ధృవీకరణ చేయాల్సి ఉంది.