గణేష్ నిమజ్జన వేళ మాడ్గుల మండలంలో డీజేలపై పోలీసుల బైండోవర్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మాడ్గుల్
మాడ్గుల మండల పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు మరియు నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రజా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా డీజే నిర్వాహకులను తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ చేశారు. శోభాయాత్రల్లో డీజేల వినియోగం నిషిద్ధమని స్పష్టం చేశారు. వృద్ధులు, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మాడ్గుల పోలీసులు తెలిపారు.